కరోనా వైరస్ కారణం గా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు అన్నీఇన్నీ కావు అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం కరోనా వైరస్ తో సహ జీవనం చేయద్దు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు అన్లాక్ మార్గదర్శకాల ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ పలు కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం దృశ్య వివిధ కార్యకలాపాల కు అనుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ కార్యకలాపాలకు ఇప్పటికే అనుమతించిన విషయం తెలిసిందే.




 దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ ప్రభావం కలిగిన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర అన్లాక్ సడలింపులు విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం దృశ్యం కీలక నిర్ణయాలు తీసుకుంటూ మార్గదర్శకాలకు అనుమతిస్తుంది. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ శుభవార్త వినిపించింది. ఇక శనివారం నుంచి జిమ్ లు  తిరిగి తీర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.




 అయితే ఎన్నో రోజుల నుంచి వ్యాయామ శాలలో తెరుచుకోవాలని ఎదురుచూస్తున్న ఎంతో మందికి ఇది శుభవార్త అనే చెప్పాలి. అదే సమయంలో ఫిట్ నెస్ సెంటర్లు మాత్రం తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. ఫిట్నెస్ సెంటర్లు మాత్రం దసరా నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తాము అంటూ తెలిపింది. ప్రస్తుతం జిమ్ లు  తెరుచూకునేందుకు అనుమతి ఇస్తున్నామని జుంబా స్టీమ్  సైనా లాంటి సెంటర్ లను  నిర్వహించేందుకు అనుమతించబోమని అంటూ స్పష్టం చేసింది మహారాష్ట్ర సర్కార్.  నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే అంటూ స్పష్టం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: