రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు సహాయం చేస్తుంది ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. దానికి తోడు భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దయతలచి 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయాలని కొంతమంది కోరుతున్నారు.

అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అసలు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పుల విషయంలో లో సడలింపు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే జీఎస్టీ పరిహారం కింద అప్పు తీసుకోవచ్చు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరద  నష్టాలను భర్తీ చేయడానికి కూడా అప్పు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చెరో ఐదు వేల కోట్లు అప్పు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇవ్వచ్చు అని భావిస్తున్నారు.

రైతులకు ఆర్థిక సహాయం చేయాలి కాబట్టి తక్షణ సహాయం కింద బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వ హామీతో అప్పు తీసుకునే విధంగా కేంద్రం వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు అప్పులు తలకు మించిన భారంగా మారిన సంగతి అర్ధమైంది. మరి భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తుంది కేంద్రం అనేది చూడాలి. ఇక జీఎస్టీ పరిహారం విషయంలో అప్పులు ఇవ్వడం పై రెండు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంపై యుద్ధం కూడా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: