ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు మీడియా సమావేశాల్లో ఎక్కువగా కనపడే వారు. మీడియాతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. అయితే ఇప్పుడు వారు మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది తెలియకపోయినా కొంతమంది మంత్రులు సైలెంట్ అవ్వడం వెనుక ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏపీలో ఏ మంత్రులు సైలెంట్ గా ఉన్నారు అనేది ఒక సారి చూస్తే... కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు.

అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పెద్దగా మీడియా ముందు కనపడటంలేదు. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ కూడా పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నాని కూడా పెద్దగా మీడియాతో మాట్లాడటం లేదు. దీని వెనుక కారణాలు ఎలా ఉన్నా సరే వారు మీడియాతో మాట్లాడకపోవడం వెనుక చాలా చర్చలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా జరుగుతున్నాయి.

అయితే విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ సహా కొంతమంది మంత్రులు మాత్రం మీడియాలో ఎక్కువగా కనపడుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో మీడియా కనబడటం లేదట. సీఎం జగన్ వద్ద ప్రాధాన్యత ఉన్న వారు కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయినట్టుగా అర్థమవుతుంది. ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఆయన సైలెంట్ గా ఉండటం పై మాత్రం ఆసక్తి ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు చెందిన కొంత మంది మంత్రులు కూడా సైలెంట్ గానే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: