గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీరప్పన్ లేదా కూసే మునిస్వామి (జనవరి 18, 1952 – అక్టోబర్ 18, 2004) ఎన్‌కౌంట‌ర్‌కు14 ఏళ్లు పూర్త‌య్యాయి ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌నే వ‌ణికించిన వీర‌ప్ప‌న్‌ను ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో 2004లో అంత‌మొందించిన విష‌యం తెలిసిందే.  చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు. కొందరిని చంపాడు. ఇతనిచేత హతమైన వారిలో కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ ఉన్నాడు.ఇతడు ఇతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో ప్రణాళికను రచించింది. ఈ ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది.


1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మైసూర్ జైల్లోఉంది. జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంది. ఎప్పుడో నా భర్త చేశాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తనను అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి శిక్షాకాలం కూడా పూర్తయి ఉండేదని చెప్పింది.



 తాను జైల్లోనే గడపడంతో ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఆందోళన కల్గిస్తోందని వాపోయింది.  ఇటీవలే అనగా 2020 లో వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీ పార్టీ ద్వారా రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు.అయితే వీర‌ప్ప‌న్‌ను దేవుడిలా కొలిచే కొన్ని అడ‌వి జాతుల ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఉన్నారు. తాను సంపాదించిన దాంట్లో ఆయా తెగ‌ల అభివృద్ధికి వీర‌ప్ప‌న్ ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్లే అత‌న్ని వారు దేవుడిలా కొలుస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికి వీర‌ప్ప‌న్ జ‌యంతి, వ‌ర్ధంతి రోజున గుర్తు చేసుకుంటు ఉత్స‌వాలు, నివాళి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కిల్లింగ్ వీర‌ప్ప‌న్ పేరుతో వీర‌ప్ప‌న్ ఎన్‌కౌంట‌ర్‌ను సినిమాగా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: