ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో అన్ని రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం వరద నీటితో నిండుకుండలా మారిపోతున్నాయి. భారీ వరద నీరు వచ్చి చేరడమే కాదు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరదనీరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులన్నీ పూర్తి గా రికార్డు స్థాయిలో నిండిపోతున్నాయి.




 అయితే శ్రీశైలం జలాశయం చరిత్రలోనే అత్యధికంగా 2009లో 17.68లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాక్ వాటర్ ప్రభావంతో కర్నూలు పట్టణం సహా జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇక ఆ తర్వాత ఇన్నేళ్లకి  మరోసారి అదే స్థాయిలో భారీ వరద వచ్చి చేరింది. తాజాగా 11 ఏళ్ల తర్వాత కృష్ణమ్మ  మరోసారి ఉగ్రరూపం దాల్చి శ్రీశైలంలో 7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అక్టోబర్ నెలలో ఇంత భారీ వరదలు రావడం ఇదే ఎంతో అరుదు అని అటు అధికారులు కూడా చెబుతున్నారు.



 అయితే కృష్ణానదిలో గత కొన్ని రోజులుగా భారీ వరద కొనసాగుతోంది. ఇక శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ప్రభావంతో కల్వకుర్తి పంపు హౌస్ కూడా నీటమునిగింది. అయితే కర్ణాటక లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవైపు భీమా మరోవైపు కృష్ణా నదులు కూడా ఉధృతంగా ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆలమట్టి జలాశయం నుంచి ఒక లక్ష డబ్భై తొమ్మిది వేల 166 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత  శ్రీశైలం జలాశయంలోకి భారీగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: