బొప్పాయి ఈ పేరు వింటేనే కొంతమంది మొహం తిప్పేస్తారు. బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోను ఉండవని వైద్యులు చెబుతారు. అయితే తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే.

అయితే ముడి బొప్పాయి గ్యాస్, కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. బొప్పాయి తినడం వలన ఆర్థరైటిస్ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ఇక గ్రీన్ టీ తో ముడి బొప్పాయిని ఉడకబెట్టడం ద్వారా తయారు చేసిన టీని తీసుకోవడం వలన ఆర్థరైటిస్‌ను నివారణ చేస్తుంది. అంతేకాదు ముడి బొప్పాయి క్రమం తప్పకుండా తీసుకోవడం వలన బరువు సులభంగా తగ్గవచ్చు.ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

అంతేకాదు బొప్పాయి పండు మూత్రపిండ సమస్యలను పోగొట్టడంలో చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. ఇక కామెర్లు వచ్చినప్పుడు లేదా కాలేయానికి సంబంధించిన ఇతర సమస్యలకి చెక్ పెట్టడానికి మంచిగా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్లు ఎ, ఇ, సి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్, క్యాన్సర్‌ను తొలగించే ఇతర పోషకాలు ఉన్నాయి.

ఇక ముడి బొప్పాయి పోషకాలతో ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇక బొప్పాయి కాయ పండినప్పుడు ఎంజైమ్ స్థాయిలు తగ్గుతాయి. ముడి బొప్పాయి ఇంకా ఆకుపచ్చగా ఉన్నప్పుడు దాని సహజ ఎంజైమాటిక్ లక్షణాలను నిలిపి ఉంచుతుంది. ముడి బొప్పాయి లోచాలా ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. ఆకుపచ్చ బొప్పాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం కాదు అని గుర్తు పెట్టుకోవాలి మరి. ముడి బొప్పాయి లేదా పచ్చి బొప్పాయి మెదడును అభివృద్ధి చేయడంలో మరింత చురుకుగా చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు బలంగా తయారవడానికి బొప్పాయి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: