జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేద ప్రజల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికీ పేద ప్రజలకు చేయూత అందించే విధంగా పలు కీలక పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేద ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు పెరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది జార్ఖండ్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రతి నిర్ణయంతో తమది ధనికుల ప్రభుత్వం కాదు పేదలకోసం ఉన్న ప్రభుత్వం అంటూ హేమంత్ సోరెన్ సర్కార్ నిరూపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేద ప్రజలందరికీ చేయూతనందించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఝార్ఖండ్  సర్కార్ ఇక ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.



 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎంతో మంది ప్రజలు కనీసం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక అల్లాడిపోతు ఉంటారు అనే విషయం తెలిసిందే. ప్రభుత్వాలు తమకు చేయూతనందించి  కాస్తయినా సహాయం చేయకపోతాయా  అని  ప్రభుత్వాల వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజలందరికీ సహాయం చేసేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దారిద్య రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



 ఈ క్రమంలోనే నిరుపేదల అందరికీ శుభ వార్త చెప్పింది జార్ఖండ్ ప్రభుత్వం. కేవలం 10 రూపాయలకే ధోతి  లేదా లుంగీ  అంతే కాకుండా పది రూపాయలకే చీరను కూడా అందించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వర్తిస్తుంది అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. ఏడాదికి రెండు సార్లు ఈ అవకాశం లభిస్తుంది అంటూ తెలిపిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్... ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఈ పథకం అమలుతో గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారూ  హేమంత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: