బీహార్లో ఎన్నికల వేడి రాజుకుందన్న  విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.  ముఖ్యంగా ఎన్డీఏ కూటమి... ప్రభుత్వ హయాంలో చేసిన అన్ని పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళుతూ ఓటర్  మహాశయులు అందరిని తమవైపు తిప్పుకునేందుకు ఎన్డీఏ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది . బిజెపి ఎన్నికల నేపథ్యంలో అటు బిజెపి పెద్దలు కూడా రంగంలోకి దిగి ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీహార్లో ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ముమ్మర  ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీల వర్షం కురిపిస్తున్నాయి.



 ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దలైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్లో ప్రచారం నిర్వహించేందుకు పూర్తిగా రంగం కూడా సిద్ధమైన విషయం తెలిసిందే. మరోసారి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సంపాదించి విజయం సాధిస్తుందని ప్రస్తుతం అందరూ ధీమాతో ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని చేయడానికి  బీజేపీ కూడా పూర్తి సహకారం అందిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రస్తుతం ఎంతో బలంగా కనిపిస్తుంది. అటు  విశ్లేషకులు కూడా ఎన్డీయే కూటమికి మరోసారి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.



 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని  ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సాధించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. జెడియు కంటే తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ బిజెపి మరోసారి నితీష్ కుమార్ కి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది అంటూ అమిత్ షా తెలిపారు. కేంద్రంలో మోడీ బీహార్లో నితీష్ సారథ్యంలో   అభివృద్ధి పరుగులు పెడు తుందని  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: