చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఏమొహం పెట్టుకుని రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు..ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేశారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే తమ్ముళ్లు ఒక్కరు కూడా లేకుండా పోయారు. చంద్రబాబు అయితే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయటకు రాలేదు.. లోకేష్ సంగతి చెప్పనవసరం లేదు.. మామూలుగానే బయటకి రాడు.. ఇక కరోనా సమయంలో అయితే గుమ్మం నుండి బయటకు రాలేదు..

 ఇక అమరావతి భూముల విషయం లో కూడా టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. కోర్టులో పిటిషన్ వేసి విచారణ ను రద్దు చేయించింది.. దీంతో చంద్రబాబు ఇపుడు టీడీపీ లో పెద్ద హీరో అయిపోయాడు.. మొన్నటివరకు చంద్రబాబు విలన్ గా కనిపించగా ఈ దెబ్బతో పార్టీ లో కొత్త ఉత్సాహం ఉరకలువేస్తోంది. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరికలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ లోకి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు నేతలు.

ఇంత జరుగుతున్నా చంద్రబాబు జగన్ టార్గెట్ చేయడం మాత్రం ఆపట్లేదు.. తాజాగా జగన్ కు పదేళ్ల నుంచి ముప్ఫయి ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలపారు. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొనిందని చంద్రబాబు తెలిపారు. జగన్ అవినీతిపరుడిగా ఉండి న్యాయవ్యవస్థపైనే బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలోనూ జగన్ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: