జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా దూరంగా ఉండడం మనం చూసాం.. ఎప్పుడైనా అవసరమొస్తే లేక రాయడం లేదా ఫోన్ చేయడం వంటి వి మాత్రమే చేస్తారు కానీ ప్రతి చిన్న విషయానికి ఎప్పుడు నేరుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలవడం వంటివి చేయరు.. అలా చేస్తే కేంద్ర నేతలకు చులకనైపోతాము అని జగన్ ఆలోచన.. ఈ విషయంలో చంద్రబాబు పూర్తి గా విఫలమయ్యారు అని చెప్పొచ్చు.. తాను అధికారంలో ఉన్నప్పుడు చీటికీ మాటికీ కేంద్రాన్ని కలిసి వారి దృష్టిలో చీప్ అయిపోయాడు.. అందుకే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బీజేపీ కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు.. అయితే ఇటీవలే జగన్ పదిరోజుల గ్యాప్ లోనే రెండు సార్లు ఢిల్లీ లో మోడీ ని కలవడం జరిగింది..

అయితే అయన కలవడానికి వైసీపీ కన్నా బీజేపీ కే ఎక్కువ అవసరం ఉందని అందరికి తెలిసిపోయింది.. అయితే ఇదే సమయమని జగన్ కూడా తన కోరికల చిట్టాను వారు ముందు ఉంచారట..కేంద్రంలో బలం తగ్గిపోతున్న బీజేపీ కి వైసీపీ సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే ప్రకటించగా కొన్ని షరతులతోనే జగన్ దీనికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.. ఇక విశాఖ రాజధాని విషయాల్లో ఏమాత్రం తగ్గేది లేదని అయన తేల్చి చెప్పారట.. అయితే ఇపుడు కోర్టులో అమరావతి రాజధాని మీద విచారణ సాగుతోంది. దాంతో విశాఖకు రాజధాని ఎపుడు తరలివస్తుంది అన్నది కొంత చర్చగానే ఉంది.

ఇటీవలే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభం సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖ రాజధాని ప్రస్తావన మరోమారు తీసుకువచ్చారు. అది కూడా కేంద్ర మంత్రితోనే. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ అయిదు లైన్ల రహదారిని నిర్మాణం చేయమంటూ జగన్ కోరడం విశేషం. విశాఖ రాజధాని నగరానికి ఈ రహదారులు చాలా అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.మొత్తానికి విశాఖ రాజధాని విషయంలో వైసీపీ వెనక్కి తగ్గిందని, ఇక రాదూ రాబోదూ అని టీడీపీ తమ్ముళ్ళు అదే పనిగా  చేస్తున్న విష ప్రచారానికి బ్రేకులు వేసేలా జగన్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. జగన్  విశాఖవాసుల్లో కొత్త ఆశలు నింపారని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: