ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలకు జూనియర్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కొంతమంది యువ నేతలను ఇబ్బంది పెడుతున్నారు అని ప్రచారం కూడా ఎక్కువగా పార్టీ వర్గాల్లో వినబడుతుంది. ప్రధానంగా నారా లోకేష్ నుంచి సీనియర్ నేతలు బాగా ఇబ్బందులు పడుతున్నారు అని ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది తెలియదు. కానీ సీనియర్ నేతల విషయంలో మాత్రం నారా లోకేష్ అనుసరిస్తున్న శైలి చంద్రబాబును కూడా బాగానే ఇబ్బంది పెట్టింది అనేది మాత్రం వాస్తవం.

అయితే ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబునాయుడు కాస్త సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నారా లోకేష్ తో ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు వరుసగా మాట్లాడుతున్నారు. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకటరావు వంటి సీనియర్ నేతలు లోకేష్ వైఖరి కారణంగా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా విశాఖ జిల్లాకు చెందిన ఒక ఇద్దరు సీనియర్ నేతలు కూడా లోకేష్ వైఖరిపై సీరియస్ గా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ఫ్యామిలీ కూడా నారా లోకేష్ పై చాలా సీరియస్ గా ఉంది అనే ప్రచారం ఈ మధ్య కాలంలో జరిగింది.

అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది తెలియదు కానీ... నారా లోకేష్ మాత్రం పార్టీలో తన మాట నడవాలి అనే విధంగా జిల్లాల్లో కూడా ప్రయత్నాలు చేయడంతో పరిస్థితి చేయి దాటి అనే చెప్పాలి. దీంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి వీరందరినీ కూడా ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో ముందుకు నడిపించే విధంగా ఆయన వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: