విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటి భేటీ అవుతారు ఏంటి అనేది తెలియక పోయినా ఇప్పుడు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు కి ఫిర్యాదు చేయడానికి ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా దేవినేని ఉమా తనను ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాన్ని ఆయన చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లే ఆలోచనలో ఉన్నారు. విజయవాడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టాలని దేవినేని ఉమా ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు కి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు.

విజయవాడ ఫ్లైఓవర్ విషయంలో చంద్రబాబు నాయుడుదే కృషి మొత్తం అనే ప్రయత్నం దేవినేని ఉమా చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడిన ప్రతి మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు గురించే మాట్లాడుతున్నారు. కేశినేని నాని పేరు ఇప్పటివరకు కూడా దేవినేని ఉమా ప్రస్తావించిన సందర్భం అనేది ఎక్కడా లేదు. ఇక ఆయనకు అనుకూలంగా ఉన్న చాలామంది నేతలు కూడా ఇదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించకపోతే అనవసరంగా పార్టీ ఇబ్బంది పడుతుంది అనే భావనలో కేసినేని ఉన్నారని అంటున్నారు.

ఇక తన కుమార్తె ఓటమి కూడా దేవినేని ఉమ కష్టపడుతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు కి ఫిర్యాదు చేయనున్నారట. మరి ఎప్పుడు కలుస్తారు ఏంటి అనేది చూడాలి. స్థానిక నాయకులను కూడా తన నుంచి దూరం చేస్తున్నారు అనే భావనలో కేసినేని నాని ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా అంతిమంగా పార్టీని చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు ఉంటాయో చూడాలి. తన కుమార్తెతో కలిసి చంద్రబాబు నాయుడు ని దసరా తర్వాత కలవనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: