బీహార్ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నా సరే బీజేపీకి మాత్రం అనుకున్న విధంగా బీహార్ లో పరిస్థితి కనబడటం లేదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. బీహార్ లో భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు కనపడటం లేదు అనే వ్యాఖ్యలు బీజేపీ నేతలే స్వయంగా చేస్తున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా అక్కడ బీజేపీ నుంచి ఎవరు బయటకు వెళ్ళి పోతారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రధానంగా నితీష్ కుమార్ విషయంలో చాలామంది బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనే మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్న కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఆర్జెడి లోకి వెళ్ళడానికి కూడా కొంత మంది బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

ఎల్జెపి కూడా ఇప్పుడు బీజేపీ ని టార్గెట్ చేయవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఎల్జెపి లేదు అని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. దీనిపై దళిత నేతలు చాలా మంది సీరియస్ గా ఉన్నారు. వాస్తవానికి ఎల్ జే పీ క్యాడర్ ఎక్కువగా ఉన్న దళిత సామాజిక వర్గాలు అన్ని కూడా ఆ పార్టీకి అండగా ఉంటాయి. ఇప్పుడు నితీష్ కుమార్ ని చిరాగ్ పాశ్వాన్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది. మరి ఇ ఈ పరిణామాలు అన్నీ దాటుకుని బీజేపీ నేతలు ఏ విధంగా విజయాన్ని చేరుకుంటారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: