ఇక నుండి ఈ రెండు ఛానెళ్లు మన దేశం లో రావట...అయితే ఆ రెండు ఛానెల్స్ ఎందుకు రావు..? ఈ విషయం లోకి వెళితే.... టీవీ లో అన్ని భాషల ఛానెల్స్ వస్తూ ఉంటాయి. అలానే మన లో చాలా మందికి  ఇంగ్లీష్ సినిమాలు అంటే చాలా ఇష్టం, ఎక్కువగా చూస్తూ  ఉంటారు. ఇలా  అందులో ప్రముఖమైన ఛానల్స్ కూడా ఉన్న సంగతి తెలిసినదే. అయితే ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ అయిన హెచ్బీఓ, డబ్యూబీ ఈ రెండు ఛానెల్స్ లో కూడా కొత్త , పాత సినిమాలు వస్తాయి. మంచి యాక్షన్ థ్రిల్ సినిమాలు కూడా ఈ ఛానెల్స్ లో మనం చూడవచ్చు. వీటిని ఎంతో ఇష్టం చూసే వాళ్లకి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే అనాలి.

బ్యాడ్ న్యూస్ ఎందుకు అంటే....చాలా ఏళ్లుగా వార్నర్  మీడియా సౌత్ ఆసియా లో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ అనుకున్నంత మార్కెట్టు పెరగడం లేదు, ఇప్పుడు ఆన్ లైన్ మీడియా డిజిటల్ కంటెంట్ కూడా బాగా పెరిగింది. దీని  మూలం గానే ఈ ఏడాది చివరి నుంచి భారత్, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ లలో కూడా  ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది.

అలానే ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా ఓటీటీ లో రావడం మనం చూస్తున్నాం. దీని మూలం గానే పెద్దగా మార్కెట్ లేకపోవడం తో ఈ రెండు ఛానల్స్ ఇక్కడ నిలిపి వేస్తున్నారు. హెచ్బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ మన భారత్ లో రెండు డాలర్లు ఉంది. కానీ దీనిని ఎవరూ చేసుకోవడం లేదు. కాబట్టి రోజు రోజుకి వీటిని వీక్షించే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే వార్నర్ మీడియా హెచ్బీఓ, డబ్యూబీ ఛానళ్లను డిసెంబర్ 15 నుంచి  నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: