సృష్టిలో అప్పుడప్పుడు వింత అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీరెప్పుడైనా మూడు సూర్యుళ్లను చూశారా..? చూసినా మీకు డౌట్ రావొచ్చు.. మనకు ఉన్నది ఒక సూర్యుడే కదా... మరి మూడు సూర్యుళ్లు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని.. అయితే ఇలాంటి ఘటనలు వేల సంవత్సరాల తర్వాత చోటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన ఘటనలను చూసి ఆశ్చర్యపోక తప్పదు.



అయితే చైనాలోని మోహే నగరంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఈ అద్భుత ఘటనను అక్కడి ప్రజలు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. చైనీయులు ఒకేసారి ఐదు సూర్యుళ్లు లేదా మూడు సూర్యుళ్లను కళ్లారా చూస్తారు. దీన్ని సన్ డాగ్ అని అంటారు.



తుఖియాంగ్ పట్టణంలో ఈ ఏడాది ఒకేసారి ఏకంగా మూడు గంటల పాటు మూడు సూర్యుళ్లు ఆకాశంలో కనిపించాయి. ఈ అద్భుతం ఉదయం 6.30 గంటల నుంచి 9.30 వరకూ కొనసాగింది. ఈ మూడు సూర్యుళ్లను ప్రజలు వీడియోలు తీశారు. ఆటోమేటిక్ గా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మూడు సూర్యుళ్లలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ సేపు మూడు సూర్యుళ్లు కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి ఇలాంటి దృశ్యాలు ప్రపంచమంతా కనిపిస్తాయి. కానీ అవి చాలా తక్కువ కాంతితో కనిపిస్తాయి. అందువల్ల వాటిని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. చైనాలో మాత్రం అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: