మనకు వేడి చేసిందంటే తప్పకుండ కారణాలు తెలుసుకోవాలి అలానే చలువ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. అంతే కానీ నిర్లక్ష్యం చెయ్యకూడదు. వేడి చేస్తే ఏమి తోచదు.. మూత్రం లో మంట, మలబద్ధకం ,తల నొప్పి వంటి సమస్యలు  కూడా ఎదురవుతాయి. అలాంటప్పుడు  సహజంగా నే శరీర యొక్క వేడి సమస్యను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి.  మరి ఎలా చెయ్యాలో ఇప్పుడే తెలుసుకోండి. సమస్య ఉన్న వారు వెంటనే అనుసరించండి ఇక బయట పడిపోండి.

ఎక్కువుగా మసాలా తో కూడిన ఆహరం తీసుకున్న ఊరగాయలు వగైరా తీసుకున్నఈ సమస్య రావచ్చు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనా వేడిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుని అనుసరించేయండి. వేడి చేస్తే మొదట ఎక్కువగా నీరు తీసుకోవాలి. అలా అని  ఫ్రిజ్ లో పెట్టిన నీరు కాదు. మామూలు నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇలా తాగితే వేడిని తగ్గించడం లో ఇది బాగా పని చేస్తుంది లేకపోతే మజ్జిగ, కొబ్బరి నీళ్లు అయిన ఎక్కువ తీసుకోండి.

అలానే అరటి పళ్లు, పుచ్చకాయ, బొప్పాయకాయ, యాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కనుక వీటిని కూడా తీసుకోవడం మంచిదే. అలానే కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది . కర్బూజా పండు తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది. కనుక ఇలా అయిన ఫాలో అవ్వచ్చు. లేదా గ్లాసు వేడి పాలు తీసుకుని 2 లేక 3 చిన్న పచ్చ కర్పూరం పలుకులు, కొంచెం యాలుకల పొడి, తగినంత గసగసాల పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తాగితే వేడి మాయమవుతుంది. కాబట్టి ఇది కూడా మంచి పద్దతే. కానీ గసగసాలు ఎక్కువుగా వాడకూడదు. అత్యవసరమైతేనే దీనిని అనుసరించండి. ఇలా ఈ చిట్కాలతో వెంటనే వేడి తగ్గిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: