భారత దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది మాత్రం రైతన్నలు అందుకే దేశానికి వెన్నెముక అని అంటారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు పంటలను పండించడంలో ముందున్నాయి. అన్న దాతలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉండటంతో దేశానికి సరిపడా వరి మొదలుకొని తదితర వాణిజ్య పంటలను పండిస్తున్నారు.ఈ పంటలను ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. గతంలో వచ్చిన దిగుబడిని ఇప్పుడు రైతులు పండించలేక పోతున్నారు. అంతేకాక రైతుల ఆత్మ హత్యలు కూడా పెరిగాయి.

ఈ నేపథ్యంలో రైతులను అన్నీ విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశ్యం తో రైతుల కొరకు కొత్త రుణాల ను అందిస్తున్నారు. అంతే కాదు అందుకే ఇప్పుడు రైతులు కొంతవరకు పంటలను పండిస్తున్నారు. భారత ప్రభుత్వం రైతులను అన్నీ విధాలుగా ఆదుకుంటుంది. అందులో భాగంగా రైతు కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా రైతులకు భూసారాన్ని బట్టి ఎటువంటి పంటలను వేసుకోవాలి. ఎంత మోతాదులో ఎరువులను వాడుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.

ఇటీవల రైతుల కోసం కిసాన్ కార్డులను కూడా అందజేశారు.వాటి ద్వారా రైతులు పంటలకు కావలసిన మందులను.. అలాగే ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసుకో వచ్చు.. అంతే కాకుండా ముందస్తు రుణాలను కూడా పొందవచ్చునని మోదీ తెలిపారు. దీని వల్ల రైతుల అప్పులను కొంత వరకు తగ్గుతాయని భావించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త ను అందజేశారు. కిసాన్ కార్డులను ఉపయోగించి పాడి పశువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు నష్టపోరని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆలోచన ఎంతవరకు లాభాన్ని అందిస్తుంది అనేది చూడాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్చలను జరిపి రైతుల కోసం అతి తక్కువ వడ్డీలకు రుణాలను మంజూరు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: