దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం తెరాస ఎలాగైనా ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే అటువైపు కాంగ్రెస్ మరియు బీజేపీ లు వారి వారి సామర్ధ్యాలను చూపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తెరాస అధిష్టానం ఈ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా మంత్రి హరీష్ రావ్ కు అప్పగించడంతో, నియోజకవర్గమంతా సుడిగాలిలా పర్యటిస్తూ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు హరీష్ రావు ఒక సీక్రెట్ టాస్కును ఎన్నికల నేపథ్యంలో అమలు చేస్తున్నట్లు తెలిసింది.  

రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా టీం వర్క్ చేస్తున్నారు . అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని ప్రణాళికలను సరిగ్గా ఉపయోగిస్తున్నారు. తన సీక్రెట్ టాస్కులో భాగంగా తనకు నమ్మకస్తులైన 20 మంది యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్లను నాలుగు టీంలుగా విడగొట్టి దుబ్బాక నియాజకవర్గమంతా పరిశీలనకు పంపుతున్నారు.

కాగా ఈ టీంలు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తుంది. రోజుకు ప్రతి మండలంలోని నాలుగైదు గ్రామాల్లో సీక్రెట్ గా పర్యటిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏమేం జరుగుతుందన్న విషయాల్ని పరిశీలిస్తారు.రాత్రి అయ్యేసరికి తాము సేకరించిన సమాచారాన్ని హరీశ్ కు పంపుతారు. ఉదయం లేచిన వెంటనే.. రాత్రి వచ్చిన నివేదిక ఆధారంగా పనుల్నిపూర్తి చేయటం..ఇందులో ఏమైనా మార్పులు చేయవలసివస్తే హరీష్ రావ్ సెట్ చేయడం..ఇలా జరుగుతూ ఉండడం సీక్రెట్ టాస్క్ పనితనం. ఈ సీక్రెట్ మిషన్ లోని సభ్యులు సాదాసీదాగా గ్రామాల్లో తిరుగుతూ.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని గమనించటం.. స్థానికులతో మాట్లాడటం ద్వారా స్థానిక అంశాల్ని సేకరించటం లాంటివిచేస్తున్నారు.  ఇవన్నీ ఫలించి ఎన్నికలలో మంచి విజయాన్ని తీసుకురావడంలో ఈ టాస్క్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: