ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో చాలా వరకు కూడా సీఎం జగన్ దూకుడు కి వెళ్తున్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో మాత్రం ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ పైకి కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందాలి అని తను చెప్తుంటే కొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందకపోతే అనవసరంగా ఇబ్బందులు ఉంటాయి. దీనితో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి మంత్రుల ద్వారా ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక స్వయంగా సీఎం జగన్ పర్యటనకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. జగన్ మూడు జిల్లాల్లో పర్యటించే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. దసరా తర్వాత ఆయన ఈ జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఈ మేరకు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ను కూడా వైసిపి అధిష్టానం రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన కొంతమంది నేతలకు పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇవి ఎంత వరకు ఫలిస్తాయి ఏంటి అనేది చూడాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. అయితే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో అధికారుల లోపం ఉంటే మాత్రం వారిని వెంటనే తప్పించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అధికారుల తీరు పై విమర్శలు ఎక్కువగా వస్తున్నసంగతి తెలిసిందే. దీంతో వారి మీద సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: