మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. విశాఖ పై వైసిపి అమిత ప్రేమ ఒలకపోస్తోంది అని ఆయన విమర్శించారు. నితిన్ గడ్కరీకి జగన్ చేసిన ప్రతిపాదనలు అవగాహన రాహిత్యంతో చేసినవే అని ఆయన అన్నారు. 14 నెలలైంది ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్టులపైనా రివ్యూనే చేయలేదు అని మండిపడ్డారు. కేంద్రం వద్ద ఏ ప్రాజెక్టులు పెండింగ్ లో వున్నాయో జగన్ కు తెలీదు అని విమర్శించారు. సబ్బవరం నుంచి మల్కన్ గిరికి రోడ్ కోసం డిపిఆర్ సిద్దం చేసి టిడిపి  హయాంలో పంపాము అని తెలిపారు.

దాని పురోగతి గురించి ఎందుకు అడగలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు. కూర్మాన పాలెం మీదుగా అచ్చుతా పురం వరకూ  నాలుగు లైన్ల రోడ్డు  డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ రోడ్డుకు టెండర్ అయింది అని ఆయన గుర్తు చేసారు. రీ టెండర్ పిలవాలన్న ఆలోచనే లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆనందపురం  భోగాపురం  వరకూ రోడ్డు పూర్తవుతోన్న విషయం జగన్ కు  తెలుసా అని ఆయన నిలదీశారు. తెలిస్తే ఎందుకు మళ్లీ కావాలని అడిగారు అని ఆయన నిలదీశారు.

చంద్రబాబు హయాంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులను అడగడానికి జగన్ ఎందుకు వెనకాడారు అని ఆయన ప్రశ్నించారు. సింహాచల దేవస్ధానం భూ సమస్యపై కమిటీ వేస్తామనడం కాలయాపన కోసమే అని బండారు ఆరోపించారు. అదానీని కలిసినపుడు డేటా సెంటర్ పూర్తి చేయాలని ఎందుకు అడగలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పెట్రోలియం యూనివర్శిటీ స్ధలం గురించి ఒక్కసారైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. కాగా విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ సందర్భంగా సిఎం జగన్ నితిన్ గడ్కరీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: