అమరావతి: ప్రత్యర్థిని ఏమీ చేయలేనప్పుడు ఇంట్లో కూర్చుని వారిపై శాపనార్థాలు పెట్టడం అన్నది ఒక పద్దతి. ఇలా శాపనార్దాలు పెట్టడం వల్ల స్వీయ ఓదార్పు అనేది లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ కాని ఇదే పంధాలో వెళ్తుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు.. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ వాటిపై పోరాటం చేయడం వంటివి చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు కానీ, ఆయన పార్టీ, అనుకూల మీడియా కానీ ఇవన్నీ వదిలేసి కేవలం జోస్యాలు చెప్పుకుంటూ భవిష్యవాణి చెప్పుకుంటూ ఉంది. కొద్ది రోజుల నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జగన్ జైలుకు వెళ్తారు.. శిక్ష పడుతుంది అన్న దానిపై నే ప్రచారం చేసుకుంటున్నారు.

జగన్ పై వ్యక్తిగతంగా కక్ష ఉన్నవారు కూడా ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములవుతున్నారు. ఇక్కడ మనకు ఏం అర్థమవుతుందంటే.. ప్రజల్లో తిరిగి బలపడటం అన్నది మానేసి కేవలం జగన్ జైలుకు వెళ్తే చాలు తాము బలపడతాము అన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. జగన్ బయట ఉంటే ఎదుర్కోవడం ఇక సాధ్యం కాదు అని ఫిక్స్ అయిపోనట్టుగా, జగన్ జైలులో ఉంటే మాత్రమే మనుగడ సాధ్యమవుతుందన్న ధోరణితో చంద్రబాబు అండ్ టీం పనిచేస్తోందా అన్న అనుమానం కలగక మానదు. తాను శ్రమించడం పోయి.. పక్కవాడు నాశనం అయిపోతే ఆ స్థానంలో మనం వద్దాం అన్న విధంగా రాజకీయం ఏపీలో నడుస్తోందా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. జగన్ కేసుల ఆధారంగా టీడీపీ రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించినప్పటికి.. అది సాధ్యమా అన్నది కూడా పరిశీలించాలి. జగన్ పై కేసులు పెట్టంగానే.. ఆయన రాజకీయ జీవితం అంతటితో అయిపోతుంది. . వైసీపీ నాశనం అయిపోతుందని అప్పట్లో కేసులు పెట్టారు.

కానీ.. ఆ సమయంలో ఉపఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సాధించింది. 2014లో లక్ష కోట్లు అని ప్రచారం చేశారు. కానీ.. 2014 ఎన్నికల్లో కూడా ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారం కోల్పోయింది. ఇక 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ స్థాయిలో ప్రజలు కేసుల గురించి పట్టించుకోకుండా జగన్ వైపు మద్దతుగా నిలిస్తే.. టీడీపీ మాత్రం జగన్ జైలుకు వెళ్తారు.. ఆ స్థానంలో తాము వచ్చేస్తాం అని కలలు కంటున్నాయి. తాను ఎదగలేక పక్కోడు కిందపడిపోతే తాము లెవల్ అవుతాం అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: