ఆంధ్ర ప్రదేశ్ ప్రజల స్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని తెలుస్తుంది. రాష్ట్రానికి మంచి రోజులు ఇప్పటిలో వచ్చేటట్లు లేవు.. రైతులు కష్టాలు తీరేలా లేవు.. ఇప్పటికీ ఆకలి దప్పులు పడలేక చాలా మంది చనిపోతున్నారు. కరువు ఒక పక్క పీడిస్తున్న మరో పక్క మాత్రం అతి వృష్టి .. అనా వృష్టి కారణంగా పంటలు సరిగ్గా పండక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు మొండి చెయ్యి చూపించడం అమానుషం అంటూ కొందరు సామాజిక వ్యక్తులు ఆరోపిస్తున్నారు.



వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు రుణాలు మంజూరు చేశారు.అంతేకాదు పాద యాత్ర చేసి రైతుల కష్టాలను తెలుసుకొని వాటికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో ఆ కోణంలో అన్నీ రకాల చర్యలను చేపట్టి ప్రజలను అనే విధాలుగా ఆదుకున్నారు.రైతు చావులు అనే మాట వినపడలేదు..ఆ మరణానంతరం రైతుల ఆవేదనను పట్టించుకొనే నాథుడు లేకపోవడంతో ఎందరో ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా నామ మాత్రం గానే  పనులు జరిగాయి.



ఇది ఇలా ఉండగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. గత టీడీపీ ప్రభుత్వం లో ప్రజలు అనా వృష్టితో అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా కరువు ఉండటంతో రైతులు పంటలు వేసుకోవడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రాణాలను విడిచారు.ఇప్పుడు వైసీపీ జగన్ పాలనలో కూడా రైతులకు లాభాల కన్నా కూడా నష్టాలే ఎక్కువగా చవి చూసాయి.అతి వృష్టి ఎక్కువగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు భారీ వర్షాలు కురవడంతో వేసిన పంటలు నీటమునిగాయి. దాంతో చేతికొచ్చిన పంట నీట మునగడం ప్రజలు లబో దిబో మన్నారు.ఎలా చూసుకున్నా కూడా రాష్ట్రానికి కొత్త సీఎం లు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి గానీ , రైతులకు , ప్రజలకు ఎక్కడ లాభాలు రాలేదని కొందరు రాజకీయ ప్రముఖులు స్పష్టం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: