56 బిసి కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను ప్రకటించిన తర్వాత వైసీపీ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ జాబితాను బీసీ వర్గానికి చెందిన మంత్రులు విడుదల చేసారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ... వైసిపి అధికారంలోకి రావాలనే తపనతో బిసి లు పని చేశారు అని ఆయన అన్నారు. వారి శ్రమను గుర్తించిన సిఎం జగన్మోహన్ రెడ్డి బిసి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 139 బిసి కులాల వారికి కార్పరేషన్ లో చోటు కల్పించారని ఆయన వ్యాఖ్యానించరు.

 దేశంలోనే ఇంతమంది కి ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వడం ఎక్కడా లేదు అని అన్నారు. టిడిపి హయాంలో బిసిలను ఓట్లు కోసమే ఉపయోగించుకున్నారు అని విమర్శించారు. అడుగడుగునా అవమానాలు, అవహేళనలు చేశారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బిసి లకు  ఏలూరులో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నారని అన్నారు. మరో మంత్రి వేణుగోపాల్. మాట్లాడుతూ... ఈరోజు చారిత్రక దినంగా మేమంతా భావిస్తున్నాం అని చెప్పారు. బిసి లు అంటే... ‌వెనుకబడిన వర్గాలు కారు.. ‌వెన్నుముక పాత్ర ఓషించే వారని జగన్ చెప్పారు అని అన్నారు.

సమాజంలో 139కులాలు ఉండి... ప్రభుత్వం చేత గుర్తింపబడలేదు అనే వారికి సిఎం నిర్ణయంతో సువర్ణ అవకాశం కల్పించారని వివరించారు. 139 కులాలను‌ 56 కార్పొరేషన్ ల ద్వారా బిసి లకు సంక్షేమ ఫలాలను చేరువ చేశారు అని చెప్పారు. ఇంత మందిని ప్రజల్లోకి పంపి సేవ చేసే అవకాశం కల్పించిన సిఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు  చెప్తున్నామని మంత్రి అన్నారు. 56 కార్పొరేషన్ లలో  ఒక్కో కార్పొరేషన్ కు 12మంది పాలక వర్గ సభ్యులు ఉంటారని ఆయన వివరించారు. నాణ్యత గల విద్య తోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగన్ ఇంగ్లీషు మీడియం నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: