ఇప్పుడిప్పుడే పెనుసంక్షోభం నుంచి బయట పడుతున్న తరుణం లో.. ప్రపంచంలో ఫ్రాన్స్, భారతదేశంలో కేరళ లో మరోసారి కరోనా మహమ్మారి జూలు విదిల్చి తుంది. కరోనా మహమ్మారి నుంచి కాస్త ప్రజలు కోలుకొని జనజీవన స్రవంతి లోకి అడుగు పెడుతున్నారు అన్న సమయంలో ఫ్రాన్స్, కేరళలో మరో సారి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి.. తాజాగా అందినసమాచారం ప్రకారం.. కేరళలో రోజుకు వేల సంఖ్య లో కేసులు నమోదు కాగా.. ఫ్రాన్స్ లో మాత్రం ఒక్కరోజులోనే 30000 కేసులు నమోదు అవడం తో.. మరోసారి కరోనా మహమ్మారి 2వ దశను.. ప్రారంభించింది అంటూ దేశాల ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి.


 అయితే కరోనా మహమ్మారిని కట్టడిచేసే దేశాల్లో ఫ్రాన్స్, రాష్ట్రాల్లో కేరళ ముందంజలో ఉన్నాయి. భారతదేశం లో మొదటి కరోనా కేసు కేరళలో నమోదు అయిన నుంచి .. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను బాగా అప్రమత్తం చేసి ఈ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. అయితే ఇలాంటి సమయంలో మరోసారి కేసు అధిక సంఖ్య లో నమోదు కావడంతో .. కేంద్ర మార్గదర్శకాలు మా రాష్ట్రాన్ని కొంప ముంచాయి అని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.కేంద్రం వరుసగా అన్ లాక్ 1,2,3,4,5,6.. అంటూ సడలింపు ఇవ్వడంతో.. ప్రజలు పూర్తిగా స్వేచ్ఛ అలవాటుపడి.. నిర్లక్ష్యం గా వ్యవహ రించారు.


 ఈ నిర్లక్ష్యమే రాష్ట్రాన్ని కొంప ముంచిందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా కేరళ లాంటి ఎడ్యుకేటెడ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ గా నమోదు కావడంతో.. కేరళ లాంటి పరిస్థితి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎదురైతే.. పరిస్థితి ఏంటి అని తల పట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పట్లో వ్యాక్సిన్.. వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి కేంద్రానికి ప్రస్తుత పరిస్థితులు మరోసారి సవాలుగా మారాయి. ఇదే పరిస్థితి  ఫ్రాన్స్ లో కూడా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: