ఉగ్రవాదం అనేది పెను భూతం లా మారింది. ఎక్కడ చూసినా కూడా ఇదే మాట వినపడుతుంది. దేశం పై గౌరవం తో, మతం పై అభిమానంతో చాలా మంది ఉగ్రవాదులు గా మారుతున్నారు. ముఖ్యంగా కొందరు మత ప్రచార కర్తలు వారికి అలా చేస్తున్నారు. చిన్న వయసులోనే వారికి లేని పోనివి నూరి ఒక విధమైన ఆలోచనలను కలిగిస్తున్నారు..అందుకే ఇప్పుడు రోజు రోజుకు ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు ఉగ్రవాదుల దాడుల కూడా జరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఉగ్రవాదులు గా మారారు. దేశంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కారకులు గా మారుతున్నారు. అందుకే విద్యార్థి దశలోనే వారికి దేశ అభివృద్ది పై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.ఇకపోతే చాలా మంది చెడు మాటలకు పూర్తిగా బానిసలు గా మారుతున్నారు. ఉగ్రవాదం, అందులో సినిమాను తలపించేలా బాంబ్ పేలుళ్లు మొదలగునవి జరుగుతున్నాయని అందులో వాళ్ళు హీరోలు గా భావించి కరుడు గట్టిన ఉగ్రవాదులు గా మారుతున్నారు.

ఇలాంటి పరిస్థితులు ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ
రాష్ట్రా ల్లోని విద్యార్థులు ఉగ్రవాదులుగా మారుతున్నారు. ముఖ్యంగా కేరళ, బెంగుళూరు లో విద్యార్థులు ఉగ్రవాదులు గా మారుతున్నారని తెలుస్తుంది. ఆ రాష్ట్రంలో కొంత వరకు మానవత్వ విలువల పై అవగాహన ఉంది. దాంతో పాటుగా ఉగ్ర వాదం అనే దాని మీద చాలా మందికి ఇష్టం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు చిన్న వయసులోనే పిల్లలు మారుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కూడా ఎక్కడ ఉగ్రవాదులు గా మారతారో అని భయ పడుతున్నారు. పిల్లల భవిష్యత్ తో ఆడుకుంటున్న అలాంటి వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని తల్లి దండ్రులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: