బీసీలకు పదవులను ప్రకటించిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అణుగుణంగా బిసి లకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. 728 మంది బిసిలను  కార్పొరేషన్ ల ద్వారా సేవ చేసేలా ఎంపిక చేశారని ఆయన తెలిపారు. బిసిల గర్జనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరుస్తారా అనే అనుమానం మాకు కూడా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చాక మా సిఎం ఆలోచనలు తెలుసుకుని మేమే ఆశ్చర్యపోయాం అని ఆయన చెప్పుకొచ్చారు.

బిసి లు అంటే... ఓట్లు కోసం కాదు.. రాజకీయ నాయకులుగా ఎదిగేలా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. బిసి లు అంటే చేతి‌ వృత్తులకే పరిమితం కాదని... సమాజానికి వెన్నుముక అని జగన్ చెప్పారని ఆయన గుర్తు చేసారు. ఇప్పుడు చెప్పింది చేస్తాం.. మాట తప్పం.. మడమ తిప్పం  అని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని ఆయన అన్నారు. సిఎం తీసుకున్న నిర్ణయం, బలహీన వర్గాల కు ఇచ్చిన ప్రాధాన్యత కు మేము సిఎం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.

మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బిసి లు అంటే ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అనే అభిప్రాయం అని ఆయన పేర్కొన్నారు. వారి కోసం అనేక పధకాలు ప్రవేశపెడుతున్నామనే భావన రాజకీయ పార్టీలలో ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రతి పల్లె, ప్రతి ప్రాంతం లో స్థితిగతులను అర్ధం చేసుకున్నారని ఆయన తెలిపారు. బిసి సామాజిక వర్గాల‌ వారు ఆర్ధికంగా ఎదగాలని జగన్ భావించారని అన్నారు. అన్ని విధాలా వారిని చైతన్య వంతులను చేసేలా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని వివరించారు. రాజకీయంగా కూడా బిసిలు ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు 56 కార్పొరేషన్ లను ప్రకటించారని ఆయన కొనియాడారు. వారి సమస్యలను అధ్యయనం చేసి... వాటిని పరిష్కారించే దిశగానే ఈ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: