పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తెలంగాణా ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. కాంగ్రెస్, బిజెపి తెలంగాణా సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసారు. పాలమూరు రంగారెడ్డి బ్లాస్టింగ్ ల వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు నిటా మునిగిపోయాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకు  నీరు ఎలా ఇస్తారు..?  అని నిలదీశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. ఇప్పటికి ఇంకా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. పాలమూరు బ్లాస్టింగ్ ల వల్ల కల్వకుర్తి కు ప్రమాదం ఉంటుంది అని ఇంజనీర్లు హెచ్చరించారని ఆమె గుర్తు చేసారు.  సీఎం కేసీఆర్ దీనిని పెడచెవినపెట్టారు అని విమర్శించారు. టిఆర్ఎస్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకిస్తూ సీఎం కు లేఖ కూడా రాశారు.

కమిషన్ ల కోసమే ఓపెన్ కట్ పంపును హౌస్ ను  అండర్ గ్రౌండ్ పంపు హౌస్ చేశారు అని ఆమె ఆరోపించారు. అక్కడ ఎలాంటి తప్పిదాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు వెళ్ళనివడం లేదు అని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ లో సైతం పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగే విధంగా నే వాదనలు వినిపించారు అని ఆమె అన్నారు. రైతు బంధు ఇచ్చాము అయింది అనుకుంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ వర్షాలకు ప్రజలు కష్టాలు పడుతున్నారు అన్నారు. కనీసం ఏరియల్ సర్వే కూడా సీఎం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటి లోగా కల్వకుర్తి యధాస్థితికి తీసుకు వస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: