ఐక్యరాజ్య సమితిచే గుర్తింపు లేని, చైనాలోని అంతర్భాగముగా చెప్పబడుతున్న ఫసిఫిక్ మహా సముద్రములోని ఒక దీవిపేరే తైవాన్. ఇది చైనా నుండి స్వయంగా స్వాతంత్ర్యము పొందిన దేశం. అందువలన బేసిగ్గా చైనాకు దీన్ని ఆధిపత్యం చేసే అధికారం ఎంత మాత్రమూ లేదు. కానీ గత కొన్నేళ్లుగా చైనా ఈ దీవిని కూడా కలుపేసుకోవాలని నక్క పన్నాగాలు పన్నుతోంది. కానీ వారి చర్యలు ఆ దేశం తిప్పి కొడుతోంది.  

ప్రస్తుతం తైవాన్‌ తో కయ్యం పెట్టుకొనేందుకు చైనా కాలు దువ్వుతోంది. డైరెక్టుగా  సైనిక దాడికి సిద్ధమవుతున్న‌ట్లు సమాచారం. ఇప్పటికే సరిహద్దుల్లోకి చైనా ప్రభుత్వం భారీగా బలగాలను, ఆయుధాల‌ను త‌ర‌లించిన‌ట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల‌ను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో చైనా తన పైత్యాన్ని ప్రదర్శించింది. సైనిక విన్యాసాల‌ను అధికంగా ప్రదర్శించి కయ్యానికి రెడీ అని చెప్పకనే చెప్తోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీకి చెందిన 40 యుద్ధ విమానాలు తైవాన్‌ సరిహద్దు రేఖను దాటి వెళ్లడం గమనార్హం. అంతేగాక‌ ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాల‌ను సందర్శించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునివ్వడం తెలిసినదే. దీన్ని బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడికి సిద్ధమ‌వుతున్నట్టే కనిపిస్తోంది.

ప్రస్తుత తైవాన్ ప్రజలు 4,000 సంవత్సరాల ముందు చైనా భూభాగం నుండి వేరుపడి ఆ దివిలో స్థిరపడ్డారు. దాదాపు 13వ శతాబ్దంలోనే వారు అక్కడినుండి తరలి వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. అప్పటి ప్యాన్ చైనీయులు పెంగ్యూ ద్వీపంలో స్థిరపడి, దినదినాభివృద్ధి చెందారు. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చెందారు. అయినప్పటికీ గిరిజనుల విరుద్ధమైన భావాలు, వ్యాపారావకాశాలు అనుకూలించకపోవడం వలన తైవాన్ ఇతరుల దేశాలను ప్రభావితం చేయడంలో కొంచెం వెనక పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: