ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళుతారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం దానికి సంబంధించిన ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు నవంబర్ మొదటి వారంలో వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే జగన్ ఢిల్లీ వెళ్లి సైలెంట్ గా వచ్చే అవకాశం లేకపోవచ్చు అని భావిస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు . అయితే ఈ మీడియా సమావేశాన్ని ఆయన ఢిల్లీలోనే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రెండు రకాలుగా డ్రామాలు ఆడుతోందని సీఎం జగన్ కాస్త సీరియస్ గా ఉన్నారు. రాజ్యసభలో అన్ని విధాలుగా బీజేపీకి సహకరిస్తుంటే బీజేపీ మాత్రం తనను ఇబ్బంది పెడుతుంది అనే భావనలో సీఎం జగన్ ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

త్వరలోనే ఆయన కొన్ని సంచలనాలకు కూడా వేదిక అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీతో చేస్తున్న రహస్య స్నేహాన్ని అని కూడా ఆయన బయట పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ పర్యటనకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటుగా సీఎస్ నీలం సహానీ తో కలిసి ఆయన వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. ఆయనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: