ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆ పార్టీ నేతలు ఆయన సహాయ సహకారాలు అందించడం లేదు. ప్రధానంగా కొంతమంది నేతలు పదవులు అనుభవించి కూడా మీడియా ముందుకు రావడానికి ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు. మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది తెలియదు కానీ చాలా మంది నేతలు మాత్రం మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు ఎక్కువగా చేయడం లేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే మంత్రిని కలిశారు అనే వార్తలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. మంత్రి ఎవరు ఏంటి అనేది తెలియకపోయినా ఎమ్మెల్యే మాత్రం త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రితో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అక్కడ వరకు బాగానే ఉన్నా ఒక మాజీ ఎంపీ కూడా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా మాజీ ఎంపీ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఆయన దసరా తర్వాత పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీని కూడా ఆ నేత తీసుకుని వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సదరు నేతతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో పార్టీలోకి తీసుకుని వెళ్ళవడానికి కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎవరు వెళ్తారు ఏంటి అనేది దసరా తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: