తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడాని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే  ఆ ప్రయత్నాలు  అన్నీ కూడా అంతగా ఫలించే అవకాశాలు కనపడటం లేదు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసిన సరే అందుకు తగిన విధంగా వాతావరణం మాత్రం కనబడటంలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చాలామంది అసహనంగా ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేసినా సరే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి కనపడటం లేదు.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం  టిఆర్ఎస్ పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా టార్గెట్ చేశారు చేశారు ఏంటి అనేది ఒక స్పష్టత లేకపోయినా... ఎమ్మెల్యే లకు సంబంధించిన అవినీతి ఆరోపణలను త్వరలోనే రేవంత్ రెడ్డి బయటపెట్టి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉండి కొంత మంది ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని రేవంత్ రెడ్డి బయటపెట్టడానికి అన్ని ఆధారాలను సిద్ధం చేసుకున్నారని సమాచారం. త్వరలోనే ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీద సంచలన ఆరోపణలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

అంతే కాకుండా ఇద్దరు ఎంపీల మీద కూడా ఆయన ఆరోపణలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇవి ఎంత వరకు ఫలిస్తాయి ఏంటి అనేది తెలియకపోయినా త్వరలోనే రేవంత్ రెడ్డి మాత్రం టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉండవచ్చు. అటు బీజేపీ నేతలు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కి సంబంధించి కాస్త ఎక్కువగానే ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: