ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవస్థలతో ఎలా పని చేయించుకోవాలో బాగా తెలుసని అంటారు. కోర్టులు, సీబీఐ, ఈడీ.. ఇలా అనేక వ్యవస్థల్లో ఆయన తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెబుతారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన జస్టిస్ చలమేశ్వర్ కూడా గతంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారట. కానీ.. ఆయన ఇప్పుడు చంద్రబాబుకు పూర్తిగా శత్రువుగా మారిపోయారట. మరి ఎందుకు గతంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు శత్రువుగా మారారు..?

ఈ విషయంపై పచ్చ పత్రికగా పేరున్న ఓ దిన పత్రిక కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. అలా సదరు పత్రిక ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. జస్టిస్ రమణ టీడీపీకి అనుకూలం అని జగన్ ఆరోపిస్తున్నారు కదా.. ఒక్క రమణే కాదు.. ఈ జస్టిస్ చలమేశ్వర్ కూడా  ఒకప్పుడు టీడీపీ కి అనుకూలమే అని చెబుతోందా పత్రిక. జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా  తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండేవారట. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారట..

అంతే కాదు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారట. ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి  కూడా అయ్యారట. న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఎంపిక కావడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరోక్ష సహకారం ఉందని ఆ పత్రిక రాసింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితంగా, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారని రాసుకొచ్చింది. అంతే కాదు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే జస్టిస్‌ చలమేశ్వర్‌ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని ఢిల్లీలోని తన నివాసంలో కలుసుకునేవారంటూ కొత్త విషయం బయటపెట్టింది.

మరి తనకు సాయం చేసిన చంద్రబాబునే చలమేశ్వర్ ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు.. అంటే చంద్రబాబు కూడా ఏదో మతలబు చేసి ఉండాలిగా.. లేకపోతే.. చంద్రబాబు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారని చలమేశ్వర్ బలంగా నమ్ముతూ ఉండాలి. మరి ఏ కారణమూ లేకుండా అకారణంగా చంద్రబాబుపైనా.. సదరు న్యాయమూర్తిపైనా చలమేశ్వర్ కు కోపం ఎందుకు ఉంటుంది..ఆలోచించాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: