ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఏ మాత్రం కూడా సహించేది లేదు అని చెప్తున్న సీఎం వైఎస్ జగన్ ఆ విధంగా ప్రణాళికలు  సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా అవినీతి విషయంలో వైసీపీ నేతలు కానీ మంత్రులు గానీ ఎవరైనా సరే దూకుడుగా వెళితే మాత్రం అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. దీనితో సీఎం జగన్ అధికారులతో సహా ప్రతి ఒక్కరిని కట్టడి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికారుల విషయంలో సీఎం జగన్ ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

కొంతమంది అధికారులు మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సహకరించి అవినీతికి పాల్పడుతున్నారు అనే సమాచారం సీఎం జగన్ కు ప్రధానంగా చేరింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాజధాని వస్తుంది అని చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు. ఈ భూములు అక్రమాల్లో అధికారులు కూడా ఉన్నారు అనే సమాచారం సీఎం జగన్ కు అందటంతో దీనికి బంధించిన ఒక నివేదికను కూడా కొంతమంది ద్వారా ఆయన తెప్పించుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశాలు కూడా ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే సీఎం జగన్ మాత్రం ఇప్పుడు కొంతమంది విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఎవరైతే మంత్రులకు సహకరిస్తున్నారో వారందరి మీద కూడా ఆయన ఫోకస్ చేశారు. ప్రధానంగా రెవెన్యూ శాఖల అధికారులు ఈ విధంగా వ్యవహరించడంతో వారిని కట్టడి చేసే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని పై ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: