ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక లోటు ఇబ్బంది పెడుతుంటే... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు కూడా విపరీతంగా పెరిగి పోయాయి అంటూ.. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు నిజమే నంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పాటయ్యే నుంచి రాష్ట్ర ఆర్థిక వనరులు ను కరగ తీయడమే తప్ప.. రాష్ట్రాని కి వనరుల ఏవిధంగా సమకూర్చా లో తెలియని అయోమయ స్థితిలో సీఎం జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.


అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడి లో పెట్టేందుకు అబ్బాయి జగన్... బాబాయ్  వై. వి .సుబ్బారెడ్డి.. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను.. వాడుకుంటున్నారు. దీనికి ఉదాహరణగా ఇటీవల టిటిడి పాలకమండలి సమావేశం లో నిర్ణయం తీసుకున్న తీర్మానాలు .. శ్రీవారి సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ లో పెట్టాలని, టిటిడి ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్ట్ ల చెల్లించే  విరాళాలను" వడ్డీ "కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని, అధిక వడ్డీ లభించేలా టిటిడి నిధులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ లో పెట్టుబడులు పెట్టాలని.. ఈ యేడాది ఆగస్టు 28 జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని చూస్తుంటే.. వెంకన్న విరాళాల సొమ్మును జగనన్న సర్కారు ఖజానా లో కి పంపేందుకు రంగం సిద్ధం చేశారు.


అదేవిధంగా డిసెంబర్లో భారీ ఎత్తున టిటిడి ఎఫ్డిఐలు మెచ్యూర్ అవుతున్నాయి.. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది . అంతేకాకుండా భక్తులు స్వామి వారికి ఇచ్చే విరాళాలు, హుండీ లో వేసే కానుకల.. లెక్కలు కూడా భారీ అవకతవకలు జరిగాయని తెలుగుదేశం నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పే జగన్.. ఏకంగా వెంకన్న విరాళాలు కే చిల్లు పెడుతున్నాడని.. విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: