ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎవరినైనా కేంద్రమంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సుజనా చౌదరి లేదా సీఎం రమేష్ లేదా జీవీఎల్ నరసింహారావు లో ఒకరిని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు కానీ దీనికి సంబంధించి మాత్రం  బీజేపీ అధిష్టానం ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మీలో ఎవరైనా సరే కేంద్రమంత్రిగా ఎంపిక చేయవచ్చు అనే విషయాన్ని బీజేపీ నేతలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పినట్లుగా సమాచారం. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కేంద్ర మంత్రిగా దాదాపుగా సుజనా చౌదరి సీఎం రమేష్ గాని అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారిద్దరితో కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. వాస్తవానికి గతంలో సీఎం రమేష్ కేంద్రమంత్రి కావాలని భావించిన సరే ఆ అవకాశం సుజనాచౌదరి కి దక్కింది.

సుజనా చౌదరి కేంద్రమంత్రిగా సమర్థవంతంగా పని చేశారు. దీంతో ఇప్పుడు సీఎం రమేష్ కి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సీఎం రమేష్ తో పాటుగా టిజి వెంకటేష్ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరు ముగ్గురు రాజ్యసభ ఎంపీలుగా ఉన్న నేపథ్యంలో దాదాపు వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే జీవీఎల్ కి వైసీపీతో కాస్త దగ్గరి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆ పదవి దక్కకపోవచ్చు అనే భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: