తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు వేరే పార్టీలకు వెళ్లే ఆలోచన చేసే అవకాశాలు అనేది దాదాపుగా లేకపోవచ్చు. అయితే ఇప్పుడు బలపడాలి భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మాత్రం టిఆర్ఎస్ ఎంపీలకు ఎక్కువగా గాలం వేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపుగా టిఆర్ఎస్ ఎంపీల్లో ముగ్గురిని ఇప్పుడు బీజేపీ లోకి తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఖమ్మం జిల్లా కు చెందిన నామా నాగేశ్వరరావుని  సుజనా చౌదరి ద్వారా బీజేపీ లోకి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు నామ నాగేశ్వరరావు మాత్రం బీజేపీ నేతలతో కాస్త ఎక్కువగా టచ్ లో ఉన్నారు అనే  ప్రచారం ఊపందుకుంది. ఆయనతో పాటు మరో ఎంపీ విషయంలో కూడా ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానం. ఎవరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై ఆటో టిఆర్ఎస్ పార్టీలో కూడా కాస్త ఎక్కువగానే ఆందోళన నెలకొంది.

ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంది భారతీయ జనతాపార్టీ. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం త్వరలోనే బీజేపీలోకి తీసుకోవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఎవరిని తీసుకుంటారు అనేదానిపై త్వరలోనే క్లారిటీ కూడా రానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రేవంత్ రెడ్డి బీజేపీలోకి తీసుకోవచ్చు అనే భావన వినబడుతోంది. అయితే ఎంపీలను తీసుకుంటే బాగుంటుంది అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరియు టిఆర్ఎస్ పార్టీ ని కాదు అని ఏ విధంగా బయటకు వెళ్తారు చూడాలి. అయితే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే ఇబ్బంది రాకుండా ఉండటానికి ఎంపీలను బయటకు లాగాలని బిజెపి భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: