భారత్ -చైనా సరిహద్దుల్లో జరుగుతున్న  వరుస పరిణామాల తో  భారత్, చైనా సైన్యాన్ని తిప్పికొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. అదే విధంగా భూమి మీద జరిగే సైనిక యుద్ధం కు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీ తో రూపొందించిన మిస్సైల్స్ ను, యుద్ధ విమానాలను, క్రూయిజ్ క్షిపణి లను సిద్ధంగా ఉంచుకుంది. దీనితో పాటుగా ఇటీవలే భారత రక్షణ రంగం డి ఆర్ డి ఓ తయారుచేసిన హై  టెక్నాలజీ క్షిపణులు.. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


 మరో వైపు ఎయిర్ ఫోర్స్.. శత్రువు స్థావరాలను దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి పరిణామాల మధ్య మరో కీలకమైన ఒప్పందం కూడా జరిగింది.. శత్రు దేశాల తో సముద్రంలో యుద్ధం వచ్చినట్లయితే ఢీ కొట్టడానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని రెడీ చేసుకునే విధంగా భారత్ ఇటీవల ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్కు  మార్షి యస్ దగ్గర నావి బేస్ ఉంది. దాన్ని మనం వాడుకోవడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. ఇప్పటికే భారత్ ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ వంటి దేశాలతో    నా వి సామాగ్రి సంబంధించి .. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా భారత్ శత్రు దేశానికి బుద్ధి చెప్పడానికి అన్ని విధాలుగా ఇటు సరిహద్దు లో యుద్ధం వచ్చిన ఈ రెండింటిని ఢీ కొనడానికి.. సర్వం సిద్ధమని దేశాలతో చేసుకున్న ఒప్పందాలు చెబుతున్నాయి.


ఇప్పటికే భారత్ చాలా బడ్జెట్ను రక్షణ రంగానికి కేటాయించి.. ఆయుధ సంపత్తి సామర్థ్యాన్ని పెంచింది. ఒకవైపు ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానాలు, అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇప్పటికే భారత్ అమ్ములపొదిలో చేరిపోయాయి. దీంతో భారత యుద్ధ సామర్థ్యం మరింత పటిష్టం అయిందని చెప్పుకోవచ్చు. యుద్ధం వస్తే భారత్ ఎదురొడ్డి నిలబడగలదా లేదా అనే విషయం బయట పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: