భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే ఏ క్షణంలో యుద్ధం జరుగుతుంది అన్నది కూడా అర్థం కాని విధంగా ఉంది పరిస్థితి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంకండి అంటూ ఆ దేశ సైనికులు అందరికీ ఆదేశాలు జారీ చేయడం మరింత సంచలనంగా మారిపోయింది. ఇటీవలే అటు భారత ప్రభుత్వం కూడా యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది భారత్. వివిధ దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను రప్పించడం తో పాటు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎన్నో రకాల క్షిపణులు మిస్సైల్ ని కూడా పరీక్షించి భారత ఆర్మీలో చేరి మరింత పటిష్టవంతం చేసిన విషయం తెలిసిందే.




 అంతేకాకుండా ఎంతో వినోదాత్మకంగా ముందుకు కదులుతుంది భారత ప్రభుత్వం. యుద్ధం గనక తలెత్తితే ఒకేసారి పాకిస్తాన్ చైనా దేశాల ను ఢీ  కొట్టి చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత ఆర్మీ  పూర్తిగా సంసిద్ధం అవ్వగా.. అటు  ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమైపోయింది.. ఇక నేవి దళం  కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ ప్రకటనలు చేస్తున్నది . ఈ నేపథ్యంలో ఇక తరువాయి చైనాతో యుద్ధమే అన్న విధంగా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. అయితే ఒకవేళ యుద్ధానికి తలెత్తితే ఎంతో వ్యూహాత్మకంగా యుద్ధం  చేయడానికి వివిధ దేశాలకు సంబంధించిన సైనిక స్థావరాలను  ఉపయోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు అనే విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఫిలిప్పీన్స్ తైవాన్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు తమ వ్యూహాత్మక సైనిక స్థావరాలను యుద్ధంలో భాగంగా ఉపయోగించుకునేందుకు అంగీకరించాయి. ఇక ఇప్పుడు భారత్కు సైనిక స్థావరాల కు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చేందుకు మరో దేశం కూడా సిద్ధమైంది. ఇటీవల జరిగిన చర్చల్లో ఒకవేళ యుద్ధం గనక చేస్తే భారత్ ఫ్రాన్స్ కు చెందిన వ్యూహాత్మక యుద్ధ సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అంగీకరించినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: