ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే   ఇన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతూ ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది. కొన్ని దేశాలు మాత్రం ఈ మహమ్మారి వైరస్ ను మొదట్లో ఎంతో సమర్థవంతంగా నియంత్రించినప్పటికి ఆ తర్వాత మాత్రం చివరికి ఈ వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదట్లో కరోనా  వైరస్ ను ఎంతో సమర్థవంతంగా నియంత్రించిన దేశాలలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉండగా రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.



 కానీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో  కేరళలో  పరిస్థితి శరవేగంగా మారిపోతున్నది. మొన్నటి  వరకూ ఎంతో సమర్థవంతంగా కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసిన దేశం రాష్ట్రంగా ఉన్న ఫ్రాన్స్  కేరళ లో కరోనా  వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఎంత సమర్థవంతంగా కరోనా వైరస్ నియంత్రించిన దేశంగా ఉన్న ఫ్రాన్స్ లో  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏకంగా రోజుకు 30 వేల కేసులు నమోదు అవుతుండడం..  సంచలనం సృష్టిస్తోంది. అటు ఎంతో సమర్థవంతంగా కరోనా వైరస్ ను  నియంత్రించిన రాష్ట్రంగా ఉన్న కేరళలో ప్రస్తుతం ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.




 దీంతో ప్రస్తుతం ఫ్రాన్స్ కేరళకు ప్రస్తుతం కరోనా  వైరస్ ని ఎలా నియంత్రణ చేయాలో తెలియక భయం పట్టుకున్న విశ్లేషకులు చెబుతున్నారు. అదేసమయంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా రోజురోజుకు అన్లాక్  ప్రక్రియ కొనసాగుతోందని అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓవైపు ఫ్రాన్స్ లో  మరోవైపు కేరళలో నమోదు అవుతున్న  కేసులు కూడా అందరిలో మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం రెండవ దశ వ్యాప్తి  కొనసాగుతూ ఉండడం ఒక్కసారిగా కేసులు పెరుగుతూ ఉండడం కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: