ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చెప్పిందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు తెలిపారు. అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి అయి న్యాయవ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఇలాంటి రాక్షస పాలన రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని దీనికి ఈ మధ్య జరిగిన సంఘటనలను చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్మాదులు స్వైర విహారం చేస్తున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.


శాంతిభద్రతలు లోపిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయవాడలో యువతిపై జరిగిన దాడి నిదర్శనమని ఆయన అన్నారు. అయితే బాబు గారిది రెండు నాల్కల  ధోరణి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా బాబు గారు రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లో అమలుకాని గొప్ప సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలుపరిచారు. ఇందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య, వృద్ధాప్య పింఛన్లు, మొదలగు పథకాలు రాజశేఖర్ రెడ్డి కి ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఈయనను రాష్ట్ర ప్రజలు దేవు డు లా కొలిచారు. అయినా సరే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఇ రాక్షసుడిని, దుర్మార్గ పాలన అందించారని ఇలా నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు.


బాబు గారికి అనుకూలంగా ఉంటే మంచి పాలన అందించారని. వ్యతిరేకంగా ఉంటే  అరాచక పాలన రాజ్యమేలుతుందని విమర్శలు చేయడం బాబుగారి కొత్తేమీ కాదని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఓటమి నుంచి దేశంలో ఎన్నికలు వస్తాయని, ఇంకా రాష్ట్రంలో లో జగన్ పాలన మూడేళ్ల ఉందని... ఇప్పుడేమో జగన్ కు 30 ఏళ్లు జైలుశిక్ష అని ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: