ప్రస్తుత రోజుల్లో రూపాయి వస్తుందని అంటే దానికోసం ఎంతవరకు అయిన పోతారు.డబ్బు మీద పిచ్చి
 ఎక్కువ అవుతుంది. పైసామే పరమాత్మ అని అంటారు. అలాంటి ఉత్త పుణ్యానికి ఎవరూ చూసి చూసి నీళ్లు కూడా ఇవ్వరు.. అలాంటిది ఓ ప్రాంతంలో పాలను ఉచితంగా పొస్తున్నారట.. అక్కడ డబ్బులు తీసుకుంటే నేరమని అంటున్నారు.ఒకవేళ తీసుకుంటే పాలు ఇచ్చే ఆవులు, లేదా బర్రెలు చనిపోతాయట.. అందుకనే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆచారం లా కొనసాగిస్తున్నారు.



అసలు విషయానికొస్తే.. ఈ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. కర్నూల్ లోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. గంజహళ్లిలో 400కు పైగానే పశువులున్నాయి. ప్రతి రోజూ ఐదారు వందల లీటర్ల పాలు ఇస్తాయి. కానీ ఏ రోజూ వారు పాలను అమ్మరు. అవసరమైన మేరకు ఇంట్లో వాడుకుంటారు.. ఎక్కువయితే అడిగిన వారికి ఇస్తారు. కానీ, వారి దగ్గర ఒక్కపైసా కూడా తీసుకోరు. ఊళ్లో వాళ్లందరూ ఇలాగే కట్టుబడి ఉంటారు. గంజహళ్లితో పాటు కడిమెట్ల గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇకపోతే ఆ ఊరిలోని హోటల్స్ పాలు కావాలంటే కొనరు.. పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుంటారు.



ఈ ఆచారం ఆ ప్రాంతాల్లో 400 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది.. ఆ ప్రాంతంలో పాలు కొనిన , అమ్మిన కూడా నేరమని అంటున్నారు. ఒకవేళ పాలకు డబ్బులు తీసుకున్న లేదా ఇచ్చిన పాలు తీసిన పశువులకు ఏదో జబ్బు చేయడమో లేదా.. చనిపోవడం జరుగుతుందని అంటున్నారు.  ముందుగా బర్రెలు, ఆవులు ఈనితే ముందుగా స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత నోరు తెరచి అడిగితే పాలు పోస్తారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉండటం గమనార్హం.. అంతేకాదు ఆ గ్రామంలో బడేసాబ్‌ తాత దర్గా ఇప్పటికీ బాగా ఫేమస్ అట.. ఆ దర్గాను చూడటానికి చాలా మంది వస్తారట..

మరింత సమాచారం తెలుసుకోండి: