ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్లకు ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్లను నియమించింది. ఒకేసారి 728 మంది బిసి నేతలకు పదవులు దక్కాయి. మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 139 బీసీ కులాలను 56 కార్పొరేషన్ల గొడుగు కిందకు తీసుకొచ్చింది. 30 వేలు, ఆ పైన జనాభా ఉన్న కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. బీసీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా మరింత సాధికారత కల్పించటమే లక్ష్యం అని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఇప్పటికే జీఓ జారీ అయ్యింది. ఆదివారం కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తూ...జాబితాను విడుదల చేశారు మంత్రులు.

ఇక...ఒకేసారి బీసీ కార్పొరేషన్లకు నియామకాలు చేయటంతో  728 మంది బీసీ నేతలకు పదవులు దక్కాయి. మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయించారు. 56 ఛైర్‌పర్సన్లలో మహిళలకు 29, పురుషులకు 27 లభించాయి. జిల్లాల ప్రాతినిధ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లాకు మాత్రం అత్యధికంగా ఆరు  కార్పొరేషన్లు దక్కాయి. దేశంలోనే బీసీలకు ఇంతగా గౌరవాన్ని కల్పించిన ఏకైక సీఎం వైయస్ జగన్ అని బీసీ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు‌, అభివృద్ధి కార్యక్రమాల్లో బీసీ వర్గాలకు కేటాయింపులను కార్పొరేషన్లు పర్యవేక్షిస్తాయి. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూస్తాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.  56 బీసీ కార్పొరేషన్లలో 728 పదవుల భర్తీ జరిగింది. ఛైర్‌పర్సన్లు..డైరెక్టర్లను నియమించింది ప్రభుత్వం. బీసీ మహిళలకు పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: