చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు.. నలభై ఏళ్లుగా రాజకీయం లో ఉండి చంద్రబాబు  కు ఏమాత్రం కూడా తెలియకపోతే ఎలా.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయన చెరగని ముద్ర వేస్తున్నారు.. ఇక ఇప్పుడు జగన్ ను విమర్శించడంలోనూ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు.. గతంలో ప్రజలకు చేయని సేవనంత ఇప్పుడు జగన్ విమర్శించడం పై పెడుతున్నారు.. ఇక ఆంద్రప్రదేశ్ లో తిరుపతి  పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం అక్కడ పోటీ చేయకూడదని అనుకుంది..

సిట్టింగ్ ఎంపీ మరణించడంతో పాటు, ఆయనకు ఎక్కువగా టీడీపీతో అనుబంధం ఉండటంతో చంద్రబాబు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సీనియర్ నేతలతో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఇక్కడ పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట.. టీడీపీ తరపున ఇప్పటికే చాలామందిని అభ్యర్ధులుగా ప్రయోగం చేసేసున్నారు. ఎలాగంటే ప్రతి ఎన్నికలోను ఓ కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటంతో పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది.

అయితే చంద్రబాబునాయుడు సొంతజిల్లా కాబట్టి ఎవరినో ఒకరిని పోటికి దింపకపోతే పరువు సమస్య.ఈ  విషయాలను దృష్టిలో ఉంచుకునే సోమిరెడ్డి టీడీపీ పోటి చేస్తుందని ప్రకటించినట్లుంది. అంటే అభ్యర్ధి తేలకపోయినా పోటికి మాత్రం తెలుగుదేశంపార్టీ రెడీ అయిపోయిందన్నమాట. ఇక గతంలో బీజేపీ కి సపోర్ట్ గా ఉంటామని చెప్పి ఇప్పుడు రంగంలోకి దిగడంతో భవిష్యత్ లో బీజేపీ ప్రవర్తన టీడీపీ తో ఎలా ఉంటుందో చూడాలి.. అసలే బీజేపీ తో మంచి గా ఉండాలని చూస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఈ నిర్ణయం వారికీ కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: