పండుగ సీజన్లో ఈ కామర్స్ దిగ్గజ సంస్థలే  కాదు పలు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎన్నో అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన  విషయం తెలిసిందే. వడ్డీరేట్లను తగ్గించడం ప్రాసెసింగ్ ఫీజును తగ్గించడం లేదా వివిధ వస్తువుల కొనుగోలు విషయంలో భారీ డిస్కౌంట్లు ఇవ్వడం లాంటి ఆకర్షనీయమైన ఆఫర్లతో తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాయి బ్యాంకులు. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపండుగ సీజన్లో కీలక నిర్ణయం తీసుకుని తమ కష్టమర్లందరికీ తీపి కబురు చెప్పిన. అదిరిపోయే ఆఫర్ ను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది




 స్టేట్ బ్యాంక్ కస్టమర్ లకు గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ కార్ లోన్ లపై   రుణాలు తక్కువ వడ్డీ రేటుకి అందించేందుకు సిద్ధమయ్యింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ రుణాలు అన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజును కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కావాలి అంటే ఈ లోన్ ను  ఎస్బిఐ  యోనో  యాప్  నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఒకవేళ స్టేట్ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది.. ఇక ఈ రుణాలు 36 నెలల్లోగా చెల్లించేందుకు అవకాశం కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఇక పర్సనల్ లోన్ పై కూడా తక్కువ శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. కారులో తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇలా పండుగ సీజన్లో ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... కస్టమర్లు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్న  విషయం తెలిసిందే. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా అటు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థలు కూడా తమ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఈ పండుగ సీజన్ లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: