కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రెండుసార్లు భారీ మెజారిటీతో విజయం సాధించిన బిజెపి తిరుగులేని పార్టీగా ప్రస్తుతం కేంద్రంలో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది . ఈ క్రమంలోనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ విమర్శల పర్వం కొనసాగిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయితే కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపుతూ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకు పడుతూనే ఉన్నారు.



 ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసి ప్రజల్లో  వ్యతిరేకత తీసుకురావడానికి కొన్ని రోజుల పాటు ర్యాలీలు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు దిగజార్చేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విరుచుకు పడుతోంది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఇటీవలే కాంగ్రెస్ నేతలందరికీ కీలక పిలుపునిచ్చారు.



 బీజేపీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరికీ పిలుపునిచ్చారు సోనియా గాంధీ. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారతీయులందరూ ఎంతో కష్టపడి నిర్మించిన భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు దారుణ స్థితికి కూడా దిగజార్చుతుందని... అంతేకాకుండా హరిత విప్లవం ఫలితాలు నిర్వీర్యం చేసేందుకు వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది అంటూ విమర్శలు చేశారు సోనియా గాంధీ. వ్యవసాయ బిల్లులు కోట్ల మంది రైతులు కూలీల మరణశాసనం అంటూ వ్యాఖ్యానించిన సోనియాగాంధీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు అందరూ ప్రజల తరఫున పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: