తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నాన అవస్థలు ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహానగరం మొత్తం జల దిగ్బంధం లో ఉండిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.అయితే ఈ పరిస్థితి నుంచి ప్రజలు కోలుకోలేక పోతున్నారు. అన్ని జిల్లాల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. అన్నీ రంగాలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారి గా చీకటి కోణంలో మునిగి పోయింది. గత వందేళ్ల లో ఎప్పుడు లేని విధంగా వర్షం కురిసిందని అధికారులు చెప్తున్నారు. 



ఇది ఇలా ఉండగా హైదరాబాద్ లో భారీగా వచ్చిన వరద నీళ్లకు నది జలాలు నిండు కుండను తలపిస్తున్నాయి. వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదిలేశారు.దాంతో నగరం మొత్తం నీళ్లతో నిండి పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయాయి. పలు ప్రహరీ గోడలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మృత్యువాత పడ్డారు..కొన్ని మృత దేహాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని లభ్యమయ్యాయి. ఇప్పటి వర్షం ఫుల్ గా పడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 



వరద మృతులను పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ ప్రముఖులు అందరూ మృతులను పరామర్శించడానికి పోటెత్తారు..మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాజాగా మృతుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు తెరాస సర్కార్ మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ భాగంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న  ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ మేరకు బియ్యం, కందిపప్పు నెలకు సరిపడే సరుకులను పంపిణీ చేశారు. చేసుకోవడానికి వసతి లేదు కానీ సరుకులు ఏం చేసుకోవాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.చెరువులు ఎత్తి వేసి ఇల్లు కట్టిచారు అప్పుడు తెలియలేదా అని రాజకీయ ప్రముఖులు తెరాస పై దుమ్మెత్తి పోతున్నారు. మరి ఈ విషయం పై తెరాస సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: