ఇటీవల ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన  ఘటన యూపీ అత్యాచార ఘటన.. ఈ ఘటన జరిగడం అమానుషం అని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా లో మాత్రం అమ్మాయిల పై అత్యాచారాలు రోజు జరుగుతున్నాయి. ఇటీవల చాలా మంది ఈ ఘటనకు గురైయ్యారు. పలువురు గ్యాంగ్ రేప్ కు గురై ప్రాణాలను కోల్పోయారు.. అయిన యూపీ, ఎంపీ లలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం ఆగలేదు. పోలీసులు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటున్న కూడా ఈ ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు..



ముఖ్యంగా గ్యాంగ్ రేప్ లో జరగడం వాటికి విచారణ పేరుతో సాగదీయడం జరుగుతున్నాయి. ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం , ప్రజలు నిరసనలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన హత్రాస్ ఘటన మాత్రం అందరినీ కంటతడి పెట్టించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు అగ్రరూపాన్ని చవి చూశాయి. అంత తీవ్ర పరిణామాలు ఒకవైపు రేగుతున్న ప్రభుత్వం మాత్రం ఏదో చేయాలని చేస్తున్నాయి.




రాజకీయ చర్చలకు దారితీసిన ఈ ఘటన  పై కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యాచార ఘటనలో ప్రభుత్వం విఫల మైంది.. దళిత యువతి కావడంతో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెలు వేత్తుతున్నాయి. అయితే నిందితులు మాత్రం ఆ తప్పు మేము చేయలేదు అంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ ఘటన పై విచారణ మాత్రం సీబీఐ కు ఆయా ప్రభుత్వం అప్పగించింది. సీబీఐ అధికారులు మాత్రం కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విచారణ ఎంతవరకు పూర్తవుతుంది.. ఎప్పుడు పూర్తి అవుతుంది అనే అంశాలు తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా ఘటనలు జరగక ముందు చర్యలు తీసుకోవాలి కానీ జరిగిన తర్వాతా చేస్తే పోయిన ప్రాణం తిరిగి రాదని ప్రజలు రాజకీయ ప్రముఖులు ఆరోపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: