తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.  పార్టీలో సమర్ధనేతలకు కీలక పదవులను పార్టీ అధినేత ప్రకటించారు. టీడీపీ కమిటీలను ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్ నేతలకు పెద్ద పీట వేసారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ ను కొనసాగించింది. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని నియమించారు.

27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేసారు. 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌ రెడ్డి, బక్కిన నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌ రావు ని ఎంపిక చేసారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, మెచ్చా నాగేశ్వర రావు ఎంపిక చేసారు.

పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్‌ గజపతి రాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యా రాణి, రావుల, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ ని నియమించారు. జాతీయ టీడీపీ అధికార ప్రతినిధులుగా దీపక్‍ రెడ్డి, పట్టాభి రామ్, నసీర్, ప్రేమ్‍ కుమార్, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి  ని  ఎంపిక చేసారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‍గా  బచ్చుల అర్జునుడు, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మునిరత్నం, జి.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ని నియమించారు. కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్యని నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: