గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ముఖ్యంగా మంత్రి కేటీఆర్  జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని కాస్త పట్టుదలగా ఉన్న మంత్రి కేటీఆర్... ఇప్పుడు చాలా వరకు కూడా ప్రచారంలో ఆయన ముందుంటున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో సహాయక చర్యల విషయంలో కూడా ఆయన అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశాలు కనబడుతున్నాయి.

దీనితో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హైదరాబాదులో మిగిలిన మంత్రులు చాలామంది కూడా ఇప్పుడు పర్యటనలకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాసరే నలుగురు మంత్రులు హైదరాబాద్ పరిధిలో పర్యటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒక సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన మంత్రులు ఎవరూ కూడా ప్రజల్లోకి రాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకపక్కన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నా సరే మిగిలిన మంత్రులు ఎవరూ కూడా ప్రచారానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

కనీసం వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వచ్చి మాట్లాడకుండా ఉంటున్నారు. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే పార్టీ నష్టపోతుందని మంత్రి కేటీఆర్ కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు స్వయంగా ఆయన ఫోన్ చేసినా సరే ఇక బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. హైదరాబాదులో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. కొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీలో పనిచేయడానికి ఆసక్తి చూపించకపోవడం తో ఇప్పుడు మంత్రి అసహనం గా ఉన్నారు. త్వరలోనే కొంత మందికి నేరుగా ఆయన ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: