ఈ విషయంలో మొదటి నుంచి తెలుగు దేశం అనుకూల పత్రికలుగా పేరున్న ఆ రెండు పత్రికలు వివాదాస్పదంగానే వ్యవహరించాయి. సీఎం జగన్ ప్రధాన సలహాదారు అయిన అజేయ కల్లమ్ ప్రెస్ మీట్ పెట్టి.. సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇలా లేఖరాశారు.. ఇదీ సంగతి.. ఆ లేఖలో విషయాలు ఇవీ అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెబితే.. అసలు ఆ విషయం తమకేమీ తెలియనట్టు ఈ రెండు పత్రికలు వ్యవహరించాయి.


కానీ ఇప్పుడు మాత్రం జగన్ లేఖ రాయడం మహా ఘోర అపరాధం అంటూ కలరింగ్ ఇస్తున్నాయి. ఈ మాట ఎవరు అంటారా అని ఎదురు చూస్తున్నాయి. ఎవరూ అనకపోతే.. అనే వాళ్ల దగ్గరకు వెళ్లి అనిపిస్తున్నాయి. వాటిని తమ పత్రికల్లో ఘనంగా ప్రచురిస్తున్నాయి. అదే సమయంలో జగన్ లేఖ రాయడాన్ని సమర్థించి వారు ఎంత పెద్దవారైనా.. పేరున్న వారైనా ఆ వార్తలను మాత్రం ఎప్పటి లాగానే తొక్కి పడుతున్నాయి.  ఇలా జగన్‌ను తప్పుబట్టే వారి వాయిస్ మాత్రమే వినిపిస్తుండటంతో.. ఈ పత్రికల వ్యవహారం పాపం.. సదరు జస్టిస్ రమణకు తలనొప్పిగా మారిందన్న వాదన వినిపిస్తోంది.


ఈ రెండు పత్రికల నైజం తెలిసిన పాఠకులు.. ఇంతగా వీళ్లు జగన్ ను వ్యతిరేకిస్తూ సదరు న్యాయమూర్తికి అనుకూలంగా రాస్తున్నారంటే.. వీరంతా ఒక్కటే అన్న క్లారిటీకి పాఠకులు వచ్చేశారు. దీంతో .. జస్టిస్ రమణకు కూడా పసుపు రంగు అంటుకుంటోంది. పాపం.. జస్టిస్ రమణకు వత్తాసు పలుకుతున్నామన్న భ్రమలో ఆ రెండు పత్రికలు ఆయనకు కీడే చేస్తున్నాయి. జగన్ ప్రెస్ మీట్ విషయం కనీసం వార్త కూడా రాయని వీళ్లు.. ఇంతగా జగన్ వ్యతిరేక వార్తలను హైలెట్ చేయడం పాఠకులకు ఈ అనుమానాలు కలిగిస్తోంది.


బహుశా.. జస్టిస్ రమణ గారికి ఈ మీడియా ప్రచారం అవసరమో లేదో తెలియదు కానీ.. పసుపు పత్రికల ఓవర్ యాక్షన్‌తోనూ...  టార్గెట్ చేసి రాస్తున్న కథనాలతో ఆయనపైనా ఓ ముద్ర పడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: